ఆదిలాబాద్‌టౌన్: మద్యం సేవించి వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వా హనదారులతోపాటు అమాయకుల ప్రాణాలు గాలి లో కలిసిపోతున్నాయి. బాధిత కుటుంబాల్లో తీరని విషాదం మిగులుతోంది. జిల్లాలో డ్రంకెన్‌డ్రైవ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత మద్యం సేవించి బైక్‌లు, కార్లు నడిపే ధోర ణి ఆందోళన కలిగిస్తోంది. రాత్రి వేళ ప్రధాన రహదారులు, పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహించి మద్యం మత్తులో వాహనా లు నడిపేవారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నా రు. గతంలో జరిమానాతోనే సరిపెట్టగా, వారి తీరులో మార్పు రాకపోవడంతో మరింత కఠినంగా వ్య వహరిస్తున్నారు. ఇటీవల పలువురు మందుబాబు లపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా వారికి జరిమానాతోపాటు జైలు శిక్ష విధించారు. మ ద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం లాంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఉదయం వేళలోనూ కేసులు..
ఇదివరకు రాత్రి వేళ మాత్రమే పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఉదయం 8 గంటల సమయంలోనూ పోలీసుల తనిఖీల్లో మందుబాబులు మద్యం సేవించి వాహనాలు నడుపు తూ పట్టుబడడం ఆందోళనకు గురి చేస్తోంది. ఉద యం 10గంటల వరకు మద్యం షాపులు తెరుచుకో కపోగా బెల్ట్‌షాపుల్లో మద్యం సేవించి వాహనాలపై ప్రయాణాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ చౌక్‌లో నిత్యం కేసులు
జిల్లాకేంద్రంలోని తెలంగాణచౌక్‌లో నిత్యం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా నాలుగైదు డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఎక్కువ మొత్తంలో ఈ కేసులు నమోదవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాహనదారులు త మ ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టొద్దని వారు సూచిస్తున్నారు.
ఇటీవల నమోదైన కేసుల్లో కొన్ని..
జిల్లాలో ఇటీవల డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబులకు కోర్టు జైలు శిక్ష విధించింది. వారం క్రి తం జిల్లా వ్యాప్తంగా 20 పోలీస్‌స్టేషన్ల పరిధిలో పో లీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 1,558 వాహనాలను తనిఖీ చేశారు. సాయంత్రం 6నుంచి రాత్రి 10 గంటల వరకు 79 డ్రంకెన్‌డ్రైవ్ కేసులు, తొమ్మిది మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదైనట్లు వారు తెలిపా రు. గతనెల 29న ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు మద్యం సేవించిన ఇద్దరు వాహనదారులపై కేసు న మోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి మూడు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు. ఇటీవల ఇచ్చోడ పోలీస్‌స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ ఐదుగురికి కోర్టు ఒక్కరోజు చొప్పున జైలు శిక్ష, తొమ్మిది మందికి జరిమానా విధించింది. ఆదిలాబాద్ ట్రాఫి క్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 17మందికి జైలు శిక్ష వేసింది. అయినప్పటికీ మందుబాబుల్లో మార్పు కానరా వడం లేదు. పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తూ ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ఇకపై డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరిస్తున్నారు.
గతేడాది నమోదైన కేసులు 14,491
కోర్టులో జరిమానా చెల్లించినవారు 10,507
ఈ ఏడాది నమోదైన కేసులు
(ఇప్పటివరకు) 6,545
కోర్టులో జరిమానా చెల్లించినవారు 3,728
ఈ ఏడాది జైలు శిక్షపడిన వారు 31


