పసిడి ధర పెరగడంతోనే.. | - | Sakshi
Sakshi News home page

పసిడి ధర పెరగడంతోనే..

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

● కొన్నేళ్ల క్రితం కుమురంభీం చౌరస్తాలోని టూటౌన్‌ పక్కన గల ఏటీఎం మిషన్‌ను దుండగులు ఎత్తుకెళ్లిన సంఘటన విదితమే. అలాగే ఇటీవల దుండగులు ఏటీఎం సెంటర్లను పగలగొట్టడం, అందులో నుంచి డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. ● మూడేళ్ల క్రితం జిల్లాకేంద్రంలోని డీబీ జ్యూయలరీలో ఓ దుండగుడు ఇన్‌కమ్‌ ట్యాక్‌ ఆఫీసర్‌ అని చెప్పి మూడు తులాల బంగారం కొనుగోలు చేశాడు. డబ్బులు చెల్లించకుండానే నకిలీ ట్రాన్జాక్షన్‌ చూపి అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని మహారాష్ట్రలో పట్టుకున్నారు. ● రెండు నెలల క్రితం ఆదిలాబాద్‌ పట్టణంలోని వసుంధర షాపింగ్‌ మాల్‌లో వెనుక భాగం నుంచి దొంగలు లోనికి చొరబడ్డారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా వైర్లను కట్‌ చేశారు. అయితే అందులో నగదు లేకపోవడంతో వెనుదిరిగారు.

కరీంనగర్‌ ఘటనతో వ్యాపారుల్లో గుబులు గతంలో జిల్లాలోనూ దొంగల హల్‌చల్‌ భద్రత చర్యలు పాటించాలంటున్న పోలీసులు బంగారం దుకాణాలపైనే కేటుగాళ్ల కన్ను

ఇలా కేటుగాళ్లు దుకాణాలు, ఏటీఎంలను ఎక్కువగా టార్గెట్‌ చేస్తూ తమ పని కానిచ్చేస్తున్నారు.

ఆదిలాబాద్‌టౌన్‌: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఓ జ్యూయలరీ షాపులో పట్టపగలే దుండగులు లూ టీకి పాల్పడ్డ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. జిల్లా వ్యాపారుల్లోనూ ఇది గుబులు రేపుతోంది. మనమెంత భద్రం అనే దానిపై సర్వత్రా చ ర్చ మొదలైంది. పసిడి ధరలు ఆకాశాన్ని అంటడంతో కేటుగాళ్లు బంగారు దుకాణాలపై కన్నేస్తున్నారు. అలాగే మహిళల మెడలో నుంచి ఆభరణాలు సైతం ఎత్తుకెళ్తున్నారు. అంతేకాకుండా వ్యాపార సముదాయాల్లోనూ చోరీలకు పాల్పడుతున్నారు. ఏటీఎం సెంటర్లను దోచుకెళ్తున్నారు. ఈక్రమంలో పో లీసు శాఖ ఇటీవల వ్యాపారులంతా తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించా రు. చోరీలు, సంఘటనలు జరిగినప్పుడు నిందితులను త్వరితగతిన గుర్తించడంతో పాటు పట్టుకునేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొంటున్నారు.

భద్రత పాటిస్తేనే చోరీలకు చెక్‌..

జ్యూయలరీ షాపులు, సూపర్‌ మార్కెట్లు, ఏటీఎం సెంటర్లు, బ్యాంకులు, వైన్స్‌లు, ఇతర వ్యాపార, వా ణిజ్య సముదాయాల్లో భద్రత చర్యలు పాటిస్తేనే చో రీలకు చెక్‌ పడనుంది. ప్రతీ దుకాణంలో లోపల, బ యట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పో లీసులు సూచిస్తున్నారు. ఏటీఏంలు, జ్యూయలరీ షాపుల్లో సెక్యూరిటీ గార్డులను నియమించుకోవ డం మంచిదని పేర్కొంటున్నారు. అలాగే షాపుల్లో సైరన్‌ అలారం ఏర్పాటు చేసుకుంటే తుపాకులు, ఇతర ఆయుధాలతో లోనికి చొరబడినప్పుడు వాటి ని నొక్కితే సైరన్‌ మోగి దొంగలు పారిపోయే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని అప్రమత్తం అవ్వడంతో వారి ఆగడాలకు చెక్‌ పెట్టవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు.

జిల్లా కేంద్రంలోని వ్యాపార సముదాయాలు

బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం తులం ధర రూ.లక్ష 50వేలకు పైగా పలుకుతుంది. తక్కువ మొత్తంలో దోపిడీకి పాల్పడినా ఎక్కువ మొత్తంలో డబ్బులు రాబట్టుకోవచ్చనే భావనతో దుండగులు ఇలాంటి చోరీలకు యత్నిస్తున్నారు. అలాగే మహిళల మెడలో నుంచి సైతం కేటుగాళ్లు బంగారు గొలుసులను ఎత్తుకెళ్తున్నారు. రోజుకో కొత్త పుంతల్లో చోరీలకు పాల్పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement