విజ్ఞాన వికాసానికి ‘స్నేహ’హస్తం | - | Sakshi
Sakshi News home page

విజ్ఞాన వికాసానికి ‘స్నేహ’హస్తం

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: జిల్లాలో గ్రామీణ ప్రాంత విద్యార్థుల విజ్ఞాన వికాసం కోసం యంత్రాంగం ‘స్నేహ’ పేరిట వేసవి శిబిరాలను వినూత్నంగా నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్‌ రాజర్షిషా తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికా రులతో బుధవారం సన్నాహక సమీక్ష నిర్వహించా రు. ఈ నెల 12 నుంచి విద్యార్థులకు ఆటపాటలు, సృజనాత్మక కార్యక్రమాల ద్వారా విజ్ఞానం పెంపొందేలా వీటిని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ప్‌ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ సంస్థ యునిసెఫ్‌ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ శిబిరాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌, ఇన్‌చార్జి డీపీవో ఫణిందర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

వినూత్న పంటలు సాగు చేయాలి

తాంసి: రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా వినూత్న పంటలు సాగు చేయాలని కలెక్ట ర్‌ రాజర్షి షా అన్నారు. మండలంలోని హస్నాపూర్‌ గ్రామ రైతువేదికలో బుధవారం నిర్వహించిన రైతు వారోత్సవాల కార్యక్రమానికి ఆయన హాజరై మా ట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కా ర్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌స్వామి, సర్పంచ్‌ లింగారెడ్డి, ఎంపీవో అవినాష్‌రెడ్డి, ఏవో రవీందర్‌, ఏఈవో అమీరుద్దీన్‌, పంచాయతీ కార్యదర్శి లావణ్య పాల్గొన్నారు.

జొన్నలు కొనుగోలు పరిమితి పెంచాలని వినతి

జొన్నల కొనుగోలు పరిమితి ఎకరానికి 15 క్వింటా ళ్లకు పెంచాలని తాంసి మండల రైతులు కోరారు. ఈ మేరకు పొన్నారి గ్రామానికి విచ్చేసిన కలెక్టర్‌ను మండలంలోని వడ్డాడి, హస్నాపూర్‌ గ్రామాల రైతులు కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్‌ ప్రభుత్వంతో పాటు మార్క్‌ఫెడ్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిమితి పెంచేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement