ఆదిలాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రధాని ఇందన పొదుపు పిలుపు మేరకు శనివారం ఆయన కారు పక్కనపెట్టారు. పట్టణంలోని కుమ్మరివాడ తదితర వార్డుల్లో సైకిల్‌పై పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ఇంధనం ఆదా చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బ్రహ్మానంద్, ధోని జ్యోతి, జోగు రవి, దత్తు, సతీష్, అశోక్ రెడ్డి, ప్రశాంత్, రవి, అజయ్ తదితరులున్నారు.


