ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతి సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తున్నారు. శనివారం వైశాఖ మాసం (బడ్‌బావై) అమావాస్యను పురస్కరించుకుని మండలంలోని గిరి గ్రామాల్లో చిన్నారులు కాళ్ళకు గజ్జెలు కట్టుకుని రోకలిబండకు కప్పను కట్టి భుజాన వేసుకుని కప్పతల్లికి స్నానం చేయిస్తూ బుడు బమ్ కుకు ఆట ఆడారు. అనంతరం గ్రామ పొలిమేరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కప్పను వదిలిపెట్టారు. ఆ కప్ప ఏదిక్కు వెళ్తుందో ఆ దిక్కు నుంచి వర్షాలు వస్తాయని గిరిజనుల నమ్మకం.
– సిరికొండ


