తొలి విడత ఇళ్ల జాబితా, గృహ గణన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఎన్యూమరేటర్లకు ప్రజలు వాస్తవ సమాచారం అందించి సహకరించాలి. ఇది ఎలాంటి సబ్సిడీలకు ముడిపడిన అంశం కాదు. భారతీయ పౌరుడిగా ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి.. ఇల్లు ఉందా లేక అద్దెకు ఉంటున్నారా అనే సమాచారాన్ని మాత్రమే సేకరిస్తారు. వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు అడగరు. కేవలం సమాచారం చెబితే సరిపోతుంది. స్వీయగణన చేసుకున్న వారు తమ ఎస్‌ఈ ఐడీ చూపిస్తే అందులోని సమాచారం సరిగా ఉందా లేదా అనే దాన్ని పరిశీలించి వెళుతారు. ఈ కార్యక్రమ విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– ఎస్.రాజేశ్వర్, అదనపు కలెక్టర్


