అక్రమ లేఅవుట్‌పై బల్దియా కొరడా | - | Sakshi
Sakshi News home page

అక్రమ లేఅవుట్‌పై బల్దియా కొరడా

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

కై లాస్‌నగర్‌: జిల్లా కేంద్రంలోని అక్రమ లేఅవుట్‌పై బల్దియా అధికారులు కొరడా ఝుళిపించారు. మహాలక్ష్మివాడ కాలనీలోని సర్వేనంబర్‌ 76/1/2, 76/1/3 ల్లోని మూడు ఎకరాల స్థలంలో ఓ రియల్‌ వ్యాపారి లేఅవుట్‌ ఏర్పాఠి టు చేశాడు. మున్సిపల్‌ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే అందులో రాళ్లను పాతి ప్లాట్లుగా మార్చాడు. దీనిపై కమిషనర్‌కు ఫిర్యాదులు రావడంతో ఆయన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను విచారణకు ఆదేశించారు. ఈమేరకు టీపీఓ సుమలత, టీపీఎస్‌ నవీన్‌కుమార్‌ సిబ్బందితో కలిసి లేఅవుట్‌ను పరిశీలించారు. నిబంధనల ప్రకారం అనుమతులు లేకపోవడంతో అక్రమమని నిర్ధారిస్తూ అందులో పా తిన రాళ్లను తొలగించి వేసినట్లు టీపీవో తెలి పారు. అక్రమంగా ఏర్పాటు చేసే లేఅవుట్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement