ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఓఎస్‌హెచ్, ఎస్‌ఎస్, ఐఆర్ కార్మిక కోడ్‌ల నిబంధనలు వ్యతిరేకిస్తూ రిమ్స్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ని బంధనల ప్రతులను దహనం చేశారు. జిల్లా సహాయ కార్యదర్శి సురేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక రూ ల్స్ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. తక్షణమే ఆ నిర్ణయాలను వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో రిమ్స్ కమిటీ అధ్యక్షుడు పేరుక దేవిదాస్, సు మంత్, సభ్యులు నాగన్న, లక్ష్మి పాల్గొన్నారు.


