బోథ్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా 439 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను, బోథ్ మండలానికి చెందిన 235 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఆయన పంపిణీ చేశారు. త్వరలోనే బోథ్‌లో నూతన ఫైర్ స్టేషన్ నిర్మాణం కానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆత్మ చైర్మన్ రాజు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని నేరేడిపల్లి, పరుపులపల్లె గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి సమస్యలు విన్నవించారు. పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. శ్రీధర్ రెడ్డి, శంకర్, సర్పంచ్‌లు విశ్వేశ్వర్‌రావ్,కృష్ణ, ఉప సర్పంచ్ దర్ము తదితరులు పాల్గొన్నారు.
రైతులకు తక్షణ సాయం అందించాలి
నేరడిగొండ: నియోజకవర్గంలో ఇటీవల అగ్నిప్రమాదాలతో పంట పొలాల్లో వ్యవసాయ పనిము ట్లు, స్ప్రింక్లర్ పైపులు అగ్నికి ఆహుతైన ఘటనపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పందించారు. జిల్లా హార్టికల్చర్ అధికారులతో శనివారం చర్చించారు. తక్షణ సాయం అందించాలని ఆదేశించారు.


