ఆదివాసీలతో సమావేశమైన అహేరి ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీలతో సమావేశమైన అహేరి ఎమ్మెల్యే

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

ఆదిలాబాద్‌రూరల్‌: మావల మండలంలోని బట్టిసావర్‌గాం శివారు ప్రాంతంలోగల కుమురంభీం కాలనీకి చెందిన ఆదివాసీలతో ఎన్‌సీపీ నేత, అహే రి ఎమ్మెల్యే, తెలంగాణ ఇన్‌చార్జి ఆత్రం బాబా గు రువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ దివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోడం గణేశ్‌ మాట్లాడు తూ.. ఇంటి స్థలాలకు పట్టాలు, నీరు, విద్యుత్‌ వి ద్య, వైద్యం, రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమస్యలను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, తెలంగాణ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పా రు. సామాజిక కార్యకర్తలు అజయ్‌కుమార్‌, చంద్ర న్న, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్‌, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రేణు క, ఉపాధ్యక్షురాలు ఇందిరా, ఆదివాసీ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు విష్ణు, తుడుం దెబ్బ ఆదిలాబాద్‌ డివిజన్‌ అధ్యక్షుడు గణపతి, నాయకులు ముకుందరావు, ప్రకాశ్‌, తులసీరాం తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement