అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కరించాలి

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

● జాప్యం లేకుండా పరిహారం అందించాలి ● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతం చేయడంతో పాటు బాధితులకు సత్వ రం పరిహారం అందేలా చూడాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌తో కలిసి కేసుల పురోగతిపై సమీక్షించారు. పోలీస్‌ స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, విచారణ, పరి హారం అందజేత తదితర అంశాలపై పోలీస్‌, రెవె న్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎస్సీల రక్షణకు సంబంధించిన చట్టాలను జిల్లాలో పకడ్బందీగా అ మలు చేస్తున్నట్లుగా తెలిపారు. విజిలెన్స్‌ కమిటీ త రచూ సమావేశమై కేసుల పురోగతిని సమీక్షించా లని సూచించారు. ఎస్సీలపై వేధింపులు జరగకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, ఏఎస్పీ రుత్విక్‌ సాయి, డీఎస్సీడీవో సునీతా కుమారి, ఆర్డీవో జగదీశ్వర్‌ రావ్‌, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాలొన్నారు.

పశువుల రక్షణకు ప్రత్యేక చర్యలు

ఆదిలాబాద్‌టౌన్‌: పశువుల సంరక్షణకు ప్రత్యేక చ ర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజర్షి అన్నారు. పట్ట ణంలోని పశువైద్యశాల వెనుక భాగంలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కంపౌండ్‌ వాల్‌ను శుక్రవారం పరిశీలించారు. జిల్లాలోని వివిధ చెక్‌పోస్టుల వద్ద స్వాధీనం చేసుకున్న పశువుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా షెడ్‌ నిర్మించాలని ఆదేశించారు. పట్టుబడిన పశువులను నేరుగా గోశాలకు తరలించడం ద్వారా స్థల సమస్య, నిర్వహణ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పే ర్కొన్నారు. పశువులకు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స అందించాలని సూచించారు. ఇందులో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రామారావు రాథోడ్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గోపీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement