తలమడుగు: ఆంక్షలు లేకుండా జొన్న పంటను ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తాంసి మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. అలాగే కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఇందులో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, సహకార సంఘ చైర్మన్ భోజారెడ్డి, సీఈవో మోతె శ్రీనివాస్, ఉత్తమ్, శ్రీధర్‌రెడ్డి, మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


