బాల్య వివాహాలు జరిపిస్తే కేసులు | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలు జరిపిస్తే కేసులు

May 18 2026 7:03 AM | Updated on May 18 2026 7:03 AM

బాల్య వివాహం చట్టరీత్యా నేరం. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు ఉంటేనే వివాహం జరిపించాలి. ఇటీవల ఆదిలాబాద్‌ పట్టణంలోని చిల్కూరినగర్‌లో జరిగిన ఓ బాల్య వివాహానికి సంబంధించి పూజారితో పాటు ఫంక్షన్‌హాల్‌ యజమాని, పెళ్లికి హాజరైన వారిపై కేసులు నమోదం చేయడం జరిగింది. పూజారులకు అవగాహన కల్పిస్తున్నాం. అలాగే తల్లిదండ్రులు బాల్య వివాహం జరిపించి పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దు.

– మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి

ఆరోగ్య సమస్యలు వస్తాయి..

బాల్య వివాహం ద్వారా బాలికలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. చిన్న వయస్సులోనే గర్భం దాల్చడంతో కాన్పు సమయంలో నెలలు నిండక ముందే ప్రసవాలు జరుగుతాయి. తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు సైతం ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. తక్కువ బరువు గల పిల్లలు పుడతారు. సిజేరియన్‌ కాన్పులు ఎక్కువగా అవుతాయి. బీపీ, రక్తహీనత సమస్యలతో బాధపడతారు. – డాక్టర్‌ రమ, గైనకాలజిస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement