రోగులకు అందుబాటులో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

రోగులకు అందుబాటులో ఉండాలి

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

గుడిహత్నూర్‌: రోగులకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి నరేందర్‌ రాథోడ్‌ సూచించారు. గురువారం స్థానిక పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎండల దృష్ట్యా పీహెచ్‌సీలో మందులు అందుబాటులో ఉంచాలని, అవసరమైన మందుల కోసం ముందస్తుగా ఇండెంట్‌ పెట్టాలని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలకు నిరంతర సేవలు అందేలా ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, పీహెచ్‌సీలోనే ప్రసూతి అయ్యేలా చూడాలని సూచించారు. జిల్లా అదనపు వైద్యాధికారి మనోహర్‌, మండల వైద్యాధికారి నీలోఫర్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement