ఉద్యోగ సోపానం..సావర్‌ఖెడా గ్రంథాలయం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ సోపానం..సావర్‌ఖెడా గ్రంథాలయం

May 17 2026 1:30 AM | Updated on May 17 2026 1:30 AM

దాతల విరాళాలతో కొనసాగుతున్న వైనం సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థులు

కెరమెరి: మండలంలోని సావర్‌ఖెడాలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం విద్యార్థులు, నిరుద్యోగుల కు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఆగస్టు త ర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కానున్న నేపథ్యంలో గ్రామానికి చెందిన సుమారు 20 మందికి పైగా నిరుద్యోగులు వేసవిలో పోటీ పరీ క్షలకు సన్నద్ధమవుతున్నారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపనతో ఉదయం నుంచి రాత్రి వరకు పుస్తక పఠనం చేస్తున్నారు. పీఎంశ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కడేర్ల రంగయ్య బడి బాగుకు చేసిన సేవలు తెలుసుకున్న ‘సర్‌’ సినిమా డైరెక్టర్‌ నాగవంశీ గ్రంథాలయ ఏర్పాటుకు రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చారు.

గ్రామస్తులు, దాతల సహకారంతో..

గ్రామస్తులతో పాటు కెరమెరి ఎంఆర్‌సీలో విధులు నిర్వహస్తున్న ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ అశ్విని, తదితరులు పుస్తకాల కొనుగోలుకు ఆర్థికసాయం అందించారు. వాటితో డైట్‌సెట్‌, బీఎడ్‌, పోలీస్‌ కానిస్టేబుల్‌, నీట్‌, ఆర్‌జేసీ, ఎస్‌ఎస్‌సీ, గ్రూప్స్‌, ఇతర కాంపిటేటివ్‌ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కొనుగోలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement