జిల్లావాసికి డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లావాసికి డాక్టరేట్‌

May 14 2026 6:15 AM | Updated on May 14 2026 6:15 AM

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రానికి చెందిన చౌహాన్‌ రాణా ఆశిష్‌ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జ ర్నలిజం, మాస్‌ కమ్యూని కేషన్‌ విభాగంలో పీహెచ్‌ డీ పట్టా పొందారు. ‘పొలిటికల్‌ ఇన్‌ఫ్లూయెన్స్‌ ఆఫ్‌ సోషల్‌ మీడియా ఏ కేస్‌ స్టడీ ఆన్‌ ట్రైబ్స్‌ ఆఫ్‌ ఆదిలాబాద్‌’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. 2023లో గిరిజన ప్రాంతాల్లో సో షల్‌ మీడియా, రాజకీయ ప్రభావంపై పరిశోధ న చేసి భూ హక్కులు, విద్య, ఆరోగ్యం లాంటి స్థానిక సమస్యలు, సంప్రదాయ ప్రచార పద్ధతుల కంటే డిజిటల్‌ ప్ర చార ప్రభావం పెరుగుతోందని వివరించారు. ఇతని తండ్రి చౌహాన్‌ జైవంత్‌ రావు విద్యుత్‌ శా ఖలో సీఈగా, తల్లి స్వరూప చవాన్‌ ఆది లాబాద్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నా రు. ఆశిష్‌కు డాక్టరేట్‌ రావడంపై పలువురు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement