ఓ వైపు ఎండల తీవ్రత పెరిగింది. భూగర్భ జలాలు అడుగంటి ప్రజలకు నీటి ఇక్కట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇచ్చోడ టీచర్స్‌కాలనీలో గల ఈ బోరు స్థానికుల నీటి అవసరాలు తీర్చుతోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు ఏకంగా 15 కనెక్షన్లతో సుమారు 50 ఇళ్లకు నీటిని అందిస్తోంది. రిటైర్డ్ ఆర్మీ జవాన్ జాదవ్ అశోక్ ఇంటి వద్ద ఉన్న ఈ బోరు బావికి మండు వేసవిలోనూ నీటి లభ్యత పుష్కలంగా ఉంటుంది. దీంతో కాలనీవాసులను వాడుకోవాలని సూచించగా వారు ఇలా ఇద్దరు ముగ్గురు కలిపి ఓ కనెన్షన్ చొప్పున ఏర్పాటు చేసుకున్నారు. నాలుగేళ్లుగా దాదాపు 50 కుటుంబాలకు 24 గంటల పాటు నీటిని అందిస్తున్న అశోక్‌ను పలువురు అభినందిస్తున్నారు. – ఇచ్చోడ


