నేరడిగొండ/బోథ్: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతుధర లభిస్తుందని, వాటిని సద్విని యో గం చేసుకోవాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నేరడిగొండ మండలంలో ని కుమారి, బోథ్ మండలంలోని మర్లపెల్లిలో ఏ ర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాలను ఆది వారం ఆయన ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా రైతు చంద్రశేఖర్‌రెడ్డి ఆయన ను శాలువాతో సన్మానించారు. ఇందులో పీఏసీఎస్ చైర్మన్ రమేశ్, సర్పంచ్ గోదావరి, ఉపసర్పంచ్ రవి, తర్నం సర్పంచ్ నీరజ, నాయకులు, పీఏసీఎస్ పాలకవర్గసభ్యులు, రైతులు పాల్గొన్నారు.


