ఆదిలాబాద్: తెలంగాణలోనూ బీజేపీ అధికారంలో కి రావడం ఖాయమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల ఫలి తాలు రావడంతో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం సంబరాలు నిర్వహించారు. పార్టీ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, మి ఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్ని కల ఫలితాల్లో దాదాపు 90 శాతం బీజేపీకి అనుకూలంగా ఉండటం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు లాలా మున్నా, జోగు రవి, దినేష్ మటోలియా, ఘటిక క్రాంతి, సుమన్, మయూర్ చంద్ర, కృష్ణ యాదవ్, శ్రీకాంత్, ఉదయ్, సూర్య, కిరణ్ సాయి పాల్గొన్నారు.


