జిల్లాకు ‘రాజీవ్‌ జ్యోతి’ యాత్ర | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు ‘రాజీవ్‌ జ్యోతి’ యాత్ర

May 18 2026 7:03 AM | Updated on May 18 2026 7:03 AM

కై లాస్‌నగర్‌: దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీని స్మరించుకుంటూ తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌ నుంచి ఢిల్లీలోని వీర్‌భూమి వరకు శామ్యూల్‌ ద్రవ్యం ఆధ్వర్యంలో చేపట్టిన రాజీవ్‌ జ్యోతి సద్భావన యాత్ర ఆదివారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. విద్యానగర్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. కార్యాలయం వరకు జ్యోతిని తీసుకువచ్చారు. ఇందులో పార్టీ పట్టణ అధ్యక్షుడు కిజర్‌ పాషా, నాయకులు సతీశ్‌, అనిల్‌, సంజయ్‌, పరమేశ్వర్‌, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement