బోథ్: రైతులు ఆధునిక సాంకేతికత, యాంత్రీకరణను అందిపుచ్చుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూ చించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాలకు హాజరై రైతులకు అవసరమై న సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత గ్రూపులుగా ఏర్పడి పీ ఎంఈజీపీ కింద 40శాతం రాయితీతో డ్రోన్లు కొనుగోలు చేసి ఉపాధి పొందాలని సూచించారు. నానో డీఏపీ వినియోగించి మంచి దిగుబడులు సాధిస్తు న్న రైతులను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. అంతకుముందు రైతువేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, సోలార్ విద్యుత్ స్టాళ్లను పరిశీ లించారు. అనంతరం రైతులను సన్మానించారు. కా ర్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌స్వామి, తహసీల్దార్ సుభాష్ చందర్, ఎంపీడీవో రమే శ్, ఆత్మ చైర్మన్ గొర్ల రాజుయాదవ్, సర్పంచ్ అన్నపూర్ణ–మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యా వారోత్సవాలను సక్సెస్ చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: ఈ నెల 11నుంచి 17వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించే విద్యావారోత్సవాలను విజ యవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా సూచించా రు. ప్రజాపాలన–ప్రగతిప్రణాళికలో భాగంగా వి ద్యావారోత్సవాల నిర్వహణపై రిమ్స్ ఆడిటోరి యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో రాజేశ్వర్‌తో కలిసి అవగాహన సదస్సు ని ర్వహించి దిశానిర్దేశం చేశారు. విద్యావ్యవస్థను బ లోపేతం చేయడం, డ్రాపౌట్స్‌ను బడుల్లో చేర్పించ డం తదితర విషయాలపై అవగాహన కల్పించారు. గుర్తింపు లేని పాఠశాలలను సీజ్ చేయాలని అధికా రులకు సూచించారు. అనంతరం సైన్స్ ఫోరం స భ్యులు కలెక్టర్, డీఈవోను శాలువాలతో సన్మానించారు. టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రవీందర్, పీఆర్ ఈఈ రాథోడ్ శివరాం, డీఎస్వో నందిని, డీఎ ల్పీవో ఫణీందర్‌రావు, ఎంఈవో సోమయ్య ఉన్నారు.
వేగంగా డిజిటల్ జనగణన
కైలాస్‌నగర్: జిల్లాలో డిజిటల్ జనగణన ప్రక్రియ వేగంగా సాగుతోందని కలెక్టర్ రాజర్షి షా తెలిపా రు. హైదరాబాద్ నుంచి డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భార తి హోలీకేరి జనగణన విధివిధానాలపై కలెక్టర్లు, అ దనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి ఆయన పా ల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 89.34 శాతం స్వయం గణన పూర్తయిందని తెలిపారు. 8,014 ప్రక్రియలకు గాను 7,160 విజయవంతంగా ముగిశాయని వివరించారు. 1,923 హౌస్ లిస్టింగ్ బ్లాక్ డీమార్కేషన్ ప్రక్రియను ఆన్‌లైన్ పోర్టల్‌లో వందశాతం పూర్తి చేసినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్.చిత్రు, డీఆర్వో స్రవంతి ఉన్నారు.
జొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జొన్నల కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచి రైతుల కు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కా ర్యాలయంలో జొన్న కొనుగోళ్లపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్ చిత్రు, మా ర్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్‌కుమార్, జిల్లా సహకార అధికారి సత్యనారాయణ, జిల్లా రవాణా అధి కారి శ్రీనివాస్, గిరిజన సహకార సంస్థ జిల్లా మేనేజర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


