నేను కబడ్డీ, వాలీబాల్‌లో శిక్షణ పొందుతున్నా. కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నా. స్నేహితులతో కలిసి ఆడటం ఆనందంగా ఉంది. ఆటల్లో గెలుపోటములు సహజమని తెలుసుకున్నా.
– శ్రీహిత, విద్యార్థిని
క్రికెట్ అంటే ఇష్టం
నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఈ క్యాంప్‌లో క్రికెట్, వాలీబాల్‌లో శిక్షణ పొందుతున్నా. జట్టు ఆటల్లో పాల్గొనడం ద్వారా టీమ్ స్పిరిట్‌తో పాటు నాయకత్వ లక్షణాలు
పెంపొందుతాయి. – శయాన్, విద్యార్థి
కరాటే శిక్షణతో ధైర్యం పెరిగింది..
కరాటే ద్వారా ఆత్మరక్షణ పద్ధతులు నేర్చుకుంటున్నా. ఇప్పుడు నాలో ధైర్యం పెరిగింది. క్రమశిక్షణ ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. గురువుల మార్గదర్శనం
బాగుంది.
– నిహస్వి, విద్యార్థిని
జిల్లాలో ఐదు చోట్ల నిర్వహిస్తున్నాం..
సమ్మర్ క్యాంప్‌ల ద్వారా విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వం పెంపొందుతుంది. ఈనెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా ఐదు చోట్ల వీటిని నిర్వహిస్తున్నాం. వీటి ద్వారా పిల్లల్లో పోలీసులనే భయం తొలుగుతుంది. అన్యాయం జరిగినప్పుడు నిర్భయంగా ఫిర్యాదు చేయాలనే విషయం అవగతమవుతుంది. అలాగే వారిలో క్రమశిక్షణ అలవాటు పడుతుంది. ఆయా క్రీడాంశాలకు సంబంధించిన నిష్ణాతులతో శిక్షణ కల్పిస్తున్నాం. అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తాం.
– అఖిల్ మహాజన్, ఎస్పీ


