ఉట్నూర్‌రూరల్: ఏజెన్సీ పరిధిలోని గిరిజన పా ఠశాలల్లో విద్యార్థుల అభ్యసన స్థాయి మెరుగుపరిచేందుకు ‘గురు సంకల్పం’ అనే కార్యక్రమాని కి ఐటీడీఏ పీవో మకరందు శ్రీకారం చు ట్టారు. ఈ మేరకు అధికారులతో కలిసి క్యూఆర్, కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. విద్యార్థు ల అభ్యసన స్థాయి మెరుగుపరిచేందుకు వినూ త్న ఆలోచనలు, ఆచరణాత్మక పరిష్కారాలు, వి జయవంతమైన ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి ఆయా పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు ప్రతిపాదనలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి జూన్ 2వరకు సమర్పించాలన్నారు. మొదటి బహుమతిగా రూ.5వేలు, రెండో బహుమతిగా రూ.4 వేలు, వినూత్నమైన వాటికి రూ.3 వేల చొప్పున నగదు అందించనున్నట్లు తెలిపారు.


