ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి ప్రారంభమైన విద్యా వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకుని రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంగీత, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డి గ్రీ కళాశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష పాల్గొన్నారు. కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాలను ప్రి న్సిపాల్ అతీక్ బేగం, లెక్చరర్లతో కలిసి విడుదల చే శారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని అన్నారు.
కేజీబీవీ నూతన భవనం ప్రారంభం
నార్నూర్: గాదిగూడలోని కేజీబీవీలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఎంపీ నగేశ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదివారం ప్రారంభించారు. రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. నార్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 57 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీవో పుల్లారావు, సెక్టోరియల్ అధికారి ప్రత్యుష, ఎస్‌వో సరస్వతి, సర్పంచ్ చంద్రకళరాజు, జాదవ్ శ్రీరామ్‌నాయక్, కాంబ్లె ఉద్దవ్, రూప్‌దేవ్, సత్యనారాయణ తదితరులున్నారు.


