ఆదిలాబాద్: హైదరాబాద్‌లోని జేఎన్ స్టేడియం వే దికగా ఆదివారం నిర్వహించిన 3వ తెలంగాణ త్రో స్, జంప్స్–400 మీటర్ల అథ్లెటిక్స్ చాంపియన్‌షి ప్’లో జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబ రిచారు. మొత్తం 10 పతకాలను (3 స్వర్ణం, 5 రజ తం, 2 కాంస్యం) కై వసం చేసుకుని జిల్లా సత్తా చా టారు. స్వర్ణ పతక విజేతల్లో అరుణ (మహిళల హ్యామర్ త్రో), విక్రమ్ సింగ్ (అండర్–20 బాయ్స్ హ్యామర్ త్రో), కె. చరణ్ (అండర్–18 బాయ్స్ షాట్‌పుట్) ఉన్నారు. రజత పతకాలను ఎన్.జి. జ్యోతీశ్వరన్ (హ్యామర్ త్రో), ఎం.సౌమ్య (హ్యామర్ త్రో), బి. జ్యోతి (డిస్కస్ త్రో), సంజన (అండర్– 16 గర్‌ల్స్ జావెలిన్ త్రో), సీహెచ్.ఖుషి(హైజంప్) సాధించారు. ఎం.సౌమ్య (డిస్కస్ త్రో), రాథోడ్ వంశీ (హ్యామర్‌త్రో) కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. విజేతలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, కార్యదర్శి పి. రా జేశ్, డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్, ఒలింపిక్ అసో సియేషన్ అధ్యక్షుడు బెల్లూరి గోవర్ధన్ రెడ్డి, పేటా అధ్యక్షుడు పార్థసారథి అభినందించారు. రాష్ట్ర అథ్లెటిక్స్ ప్రధాన కార్యదర్శి సారంగపాణి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేశ్వర్ చేతుల మీదుగా క్రీడాకారులు పతకాలు అందుకున్నారు. కోచ్ వీజీఎస్ రాకేశ్‌ను పలువురు ప్రత్యేకంగా ప్రశంసించారు.


