రోగులకు సేవలు అందిస్తున్న స్టాఫ్ నర్సులు
రోగికి వైద్యుడు చికిత్స అందిస్తే ఆచరణలో అమలు చేసేది వీరే.. భయంతో వచ్చే పేషెంట్‌లో ఆత్మస్థైర్యం నింపేది ఈ సిస్టర్సే.. ప్రసవ వేదనలో ఉన్న గర్భిణి నుంచి అత్యవసర ట్రీట్‌మెంట్ అవసరమైన రోగి వరకు వీరు అందించే సేవలే కీలకం. ప్రజారోగ్య వ్యవస్థలో వెన్నెముకగా నిలిచే వీరికి ఒక ప్రత్యేక రోజు ఉందండోయ్. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా ఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో సేవలందిస్తున్న పలువురి నర్సులపై కథనం. – ఆదిలాబాద్‌టౌన్


