ఆదిలాబాద్‌టౌన్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు నేరుగా ఎస్పీకి తమ సమస్యలను వివరించారు. ఫిర్యాదులు స్వీకరించిన ఆయన వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు. మొత్తం 29 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో సీసీ కొండరాజు, సిబ్బంది వామన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.


