మున్సిపల్ పరిధిలో వందలాది వాహనాలు ఉన్నాయి. ప్రతినెలా వాటి నిర్వహణ పేరిట లక్షల్లో ఖర్చవుతుంది. ఇందులో వేలాది రూపాయల దుర్వినియోగం అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే బల్దియా ఆధ్వర్యంలో సొంతంగా గ్యారేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం రూ.50లక్షలు కేటాయించాం. సామగ్రితో పాటు షెడ్ నిర్వహణకు అవసరమైన టెండర్లు నిర్వహిస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సంబంధిత కాంట్రాక్టర్‌కు పనులు కేటాయించి త్వరితగతిన అమలులోకి తెచ్చేలా చూస్తాం.
– బండారి అనూష, మున్సిపల్ చైర్‌పర్సన్


