పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

● జిల్లాలో ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు

ఆదిలాబాద్‌టౌన్‌: పశువుల అక్రమ రవాణాను పూర్తి గా అడ్డుకోవాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌లో చెక్‌పోస్టు సిబ్బందికి సోమవారం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బక్రీద్‌ సందర్భంగా జిల్లాలో ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిప్పర్‌వాడ, ఆనంద్‌పూర్‌, శంకర్‌గూడ, లక్ష్మిపూర్‌, లోకారి, ఉట్నూర్‌, ఘన్‌పూర్‌లో 24 గంటల పాటు తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎస్సై స్థాయి అధికారి పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న పశువులు లభిస్తే వెంటనే గోశాలకు తరలించాలన్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎస్పీ వెంట ఆది లాబాద్‌ డీఎస్పీ జీవన్‌ రెడ్డి, సీఐలు సునిల్‌ కుమార్‌, నాగరాజు, ప్రేమ్‌కుమార్‌, శ్రావణ్‌, రమేష్‌ తదితరులున్నారు.

శిక్షణతో పిల్లల్లో ప్రత్యేక ప్రావీణ్యం

శిక్షణతో పిల్లల్లో ప్రత్యేక ప్రా వీణ్యం లభిస్తుందని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన వేసవి శిబి రాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఐదు చోట్ల 550 మంది విద్యార్థులతో వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్‌ ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నార్నూర్‌, బోథ్‌లో ఏ ర్పాటు చేసిన శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్‌ రావు, డీఎస్పీలు ఎల్‌.జీవన్‌ రెడ్డి, ఇంద్రవర్ధన్‌, మావల ఎస్‌హెచ్‌ఓ రాహుల్‌కాంత్‌, సీఐలు నాగరాజు, సునిల్‌ కుమార్‌, ప్రేమ్‌కుమార్‌, శ్రావణ్‌, చంద్రశేఖర్‌, వెంకటి పాల్గొన్నారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ అఖి ల్‌ మహాజన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని డవ్‌ (డీఅడిక్షన్‌ అండ్‌ వెల్‌నెస్‌) సెంటర్‌ను సోమవారం సందర్శించారు. మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి ఈ సెంటర్‌ ఒక మంచి అవకాశమని తెలిపా రు. ఆయన వెంట ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, మావల ఎస్‌హెచ్‌వో రాహుల్‌ కాంత్‌, టూటౌన్‌ సీఐ నాగరాజు, మావల సీఐ కె.స్వామి, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పోలీసు అధికారులకు సూ చించారు. సోమవారం పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌ నిర్వహించారు. 24 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి సత్వరమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్‌ కవిత, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement