కలెక్టర్‌ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

● కుండి శేకుగూడ జీపీ సందర్శన ● క్షేత్రస్థాయిలో సమస్యల పరిశీలన

● కుండి శేకుగూడ జీపీ సందర్శన ● క్షేత్రస్థాయిలో సమస్యల పరిశీలన

నార్నూర్‌: గాదిగూడ మండలం కుండి శేకుగూడ జీపీ పరిధిలోని ఆయా గ్రామాల్లో అధికారులు శుక్రవారం పర్యటించారు. ఇటీవల గ్రామస్తులు తమ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ఆయన సంబంధిత శాఖల అధికారులను పరిశీలనకు ఆదేశించారు. ఈమేరకు డీఎల్‌పీవో ప్రభాకర్‌ ఆధ్వర్యంలో విద్యుత్‌, పంచాయతీరాజ్‌, నీటిపారుదల, హౌసింగ్‌ తదితర శాఖల అధికారులు శుక్రవారం ఆయా గ్రామాలను సందర్శించారు. గ్రామస్తులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని కుండి, కుండి శేకుగూడ, చిన్నకుండి, కుండి మరోతిగూడ గ్రామాలు ఏర్పడి దాదాపు ఏడు దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవని తెలిపారు. గ్రామాల్లో ఎక్కువగా పెంకుటిళ్లు, రేకుల ఇళ్లు ఉండటంతో వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. విద్యుత్‌ స్తంభాలు లేక రాత్రి వేళల్లో అంధకారంలో మగ్గాల్సి వస్తోందని పేర్కొన్నారు. తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని, గ్రామంలో బోరు ఉన్నప్పటికీ కరెంటు స్తంభా లు, ట్రాన్స్‌ఫార్మర్‌ లేక వినియోగంలోకి రా వడం లేదన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరా రు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీ సుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఇందులో ఎంపీడీవో శ్రీనివాస్‌, విద్యుత్‌ శాఖ ఏఈ శ్రీనివాస్‌, మీషన్‌ భగీరథ ఏఈ శివ, హౌసింగ్‌ డీఈ భుజంగ్‌రావు, ఏఈ రాకేశ్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement