ఆదిలాబాద్‌రూరల్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలని స్విమ్మింగ్ అసో సియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవికుమార్, కొమ్ము కృష్ణ అన్నారు. మండలంలోని చాందా (టి)పంచాయతీ పరి ధిలో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని ఈ నెల 24న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న వారిలో అనుదీప్‌రాజ్, లోహిత్ సాయి, చరణ్ తేజ్, మణికృత్ ఉన్నట్లు వివరించారు. విజేతలకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో కోచ్‌లు వంశీ, శ్రీనివాస్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


