రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు | - | Sakshi
Sakshi News home page

రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

రసాయన ఎరువుల వినియోగంతో పాటు సాగు ఖర్చులు తగ్గించడం, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడడం.

సేంద్రియ సాగు ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం అందించడం.

పంట మార్పిడితో సుస్థిర ఆదాయం పొందడం.

మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగు చేయడం.

సాగులో నూతన అంశాలపై అవగాహన

వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహణ

జిల్లాలోని 60 గ్రామాల్లో శాస్త్రవేత్తల పర్యటన

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైతులకు సాగు సంబంధిత అంశాల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1600 గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 60 జీపీల్లో చేపడుతుండగా, ఇప్పటికే 10 గ్రామాల్లో పూర్తయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వ్యవసాయ వర్సిటీ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏప్రిల్‌ 27న మొదలు కాగా, మే 23 వరకు కొనసాగనున్నాయి

ప్రధాన ఉద్దేశాలు..

యూరియా వాడకం తగ్గించడం, పంట మార్పిడి పాటించడం, సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటించి రైతులను అవగాహన పరిచే దిశగా కృషి చేస్తున్నారు.

ఆరు బృందాలుగా..

జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌. రాంగోపాల్‌ వర్మ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఆరు బృందాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఇందులో వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, జిల్లాలోని వ్యవసాయ కళాశాల బోధన సిబ్బంది పాల్గొని రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నారు.

ప్రాధాన్యత అంశాలు..

Advertisement
 
Advertisement
Advertisement