బంగారం ధర పెరగడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులు ప్రస్తుతం గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ మరింతగా పెంచాలి. సీసీ కెమెరాలు సంఘం, పోలీసుల ఆధ్వర్యంలో మరిన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. బంగారు దుకాణాల యజమానులు అప్రమత్తంగా ఉండడంతోనే చోరీలను నియంత్రించవచ్చు.
– లక్ష్మణ్‌రాజు, శ్రీనిధి జ్యూయలరీ యజమాని, ఆదిలాబాద్
ఎమర్జెన్సీ సైరన్ ఏర్పాటు చేసుకోవాలి..
జ్యూయలరీ షాపుల యజమానులు, ఏటీఎం సెంటర్ల వద్ద ఎమర్జెన్సీ సైరన్ ఏర్పాటు చేసుకోవాలి. దీంతో దుండగులు లోనికి చొరబడి ఆయుధాలతో బెదిరించినప్పుడు అలారం మోగితే చుట్టుపక్కల వారితో పాటు పోలీసులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రతీ షాపు వద్ద సెక్యూరిటీ గార్డులతో పాటు ఎంట్రీవద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేసుకోవాలి. దీంతో ఆయుధాలు ఉన్నవారిని లోనికి రాకుండా అడ్డుకోవచ్చు. కరీంనగర్‌లో జరిగిన ఘటనకు సంబంధించి దుండగులు జిల్లా మీదుగా వెళ్తే వారిని పట్టుకోవడానికి పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశాం.
– ఎల్.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ


