రేషన్‌దుకాణాల ద్వారా తక్కువ ధరకే జొన్నలు, మొక్కజొన్నలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరం. జొన్న బలవర్ధకమైన ఆహారం. జొన్న రొ ట్టెలు తింటే ఆరోగ్యానికి మంచిది. దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవు. రేషన్‌షాపుల్లో ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుండటంతో వాటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు. జొన్నలు అందించడం ద్వారా పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. రేషన్ షాపుల ద్వారా ఒక్కొక్కరికీ 10కిలోల చొప్పున జొన్నలు అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
– మైలారపు రాజేశ్,
టీచర్స్‌కాలనీ, ఆదిలాబాద్


