కై లాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని అదనపు కలెక్టర్లు ఎస్.రాజేశ్వర్, ఆర్‌ఎస్. చిత్రు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పింఛన్లు, ఉపాధి హామీ పథకం పనులు, భూ సమస్యల పరిష్కారం వంటి సమస్యలపై పలు అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన ఇలా..
మేమంతా ఎలాంటి జీవనాధారం లేని నిరుపేదలం. పక్కా ఇండ్లు లేవు. ఉన్న స్థలంలో చిన్నపాటి గుడిసెలు వేసుకుని ఏళ్లుగా కాలం వెల్లదీ స్తున్నాం. మాలాంటి వారి కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం ఆనందంగా ఉంది. ఎల్–2 జాబితాలో పేర్లు కలిగిన మాకు ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నాం.
– డొప్టాల గ్రామస్తులు, బేల మండలం
సర్వేనంబర్ 70నుంచి 8వరకు గల 2 కిలో మీటర్ల మేర పంటచేలకు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ సర్వేనంబర్ల పరిధిలో మండలంలో ఆరు గ్రా మాల రైతులకు సంబంధించి వెయ్యి ఎకరాలకు పైగా పంట చేలు ఉన్నాయి. సరైన రోడ్డు సౌకర్యం లేక వానాకాలంలో తీవ్ర ఇబ్బందులు ప డుతున్నాం. పొలంబాటలో భాగంగా రోడ్డు నిర్మా ణం చేపట్టి సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం.
– గిర్నూర్ రైతులు, బజార్‌హత్నూర్(మం)
మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులం. మండుతున్న ఎండల తీవ్రతకు పాఠశాలల్లోని మొక్కలను సంరక్షించాల్సి న బాధ్యత మాపై ఉంటుంది. దీంతో సెలవు రోజుల్లోనూ పచ్చదనం, పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించే మాకు ప్రభుత్వం వేసవి సెలవుల్లో వేతనాలు మాత్రం మంజూరు చేయడం లేదు. మా కు న్యాయం చేసేలా చూడాలని కోరుతున్నాం.
– ప్రభుత్వ పాఠశాలల స్వచ్ఛ కార్మికులు


