రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

● రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

కై లాస్‌నగర్‌: రైతులకు ఇబ్బందులు కలుగకుండా యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అ ధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచి వాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో తగు చర్యలు చేపట్టాలన్నారు. సరిపడా టార్పాలిన్లు, తేమనిర్ధారణ యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటా యించిన రైస్‌ మిల్లులకు వెంటవెంటనే పంపించాలన్నారు. ఇందులో కలెక్టర్‌ రాజర్షిషా, అదనపు కలెక్టర్‌ ఆర్‌ఎస్‌ చిత్రు, పౌర సరఫరాల శాఖ అధికారులు నందిని, సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement