అన్యాయాన్ని ప్రశ్నించాలని నేర్పింది.. | - | Sakshi
Sakshi News home page

అన్యాయాన్ని ప్రశ్నించాలని నేర్పింది..

May 10 2026 7:46 AM | Updated on May 10 2026 7:46 AM

● ప్రేమ పంచుతూ.. సహనం పాటిస్తూ.. ● లక్ష్యసాధనలో తోడయ్యే దైవమే అమ్మ ● నేడు మదర్స్‌డే

● ప్రేమ పంచుతూ.. సహనం పాటిస్తూ.. ● లక్ష్యసాధనలో తోడయ్యే దైవమే అమ్మ ● నేడు మదర్స్‌డే

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రపంచంలో అమ్మను మించిన దైవం లేదు. మా అమ్మ ఊర్మిల గుప్తా ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. మేము ఇద్దరం అన్నదమ్ములం, ఒక సోదరి. అమ్మా నాన్న మా అందరిని చదివించి ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేశారు. అమ్మ చేతి వంట అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రతీ విషయాన్ని వివరించి చెబుతుంది. అన్యాయం జరిగితే ప్రశ్నించాలని నేర్పించింది. కష్టపడేతత్వాన్ని అమ్మను చూసే నేర్చుకున్నాను. ఈ సమాజంలో నిస్వార్థమైన ప్రేమ తల్లిది మాత్రమే. – అఖిల్‌ మహాజన్‌, ఎస్పీ

Advertisement
 
Advertisement
Advertisement