అతివలకు ధైర్యం.. భరోసా కేంద్రం | - | Sakshi
Sakshi News home page

అతివలకు ధైర్యం.. భరోసా కేంద్రం

May 6 2026 8:25 AM | Updated on May 6 2026 8:25 AM

● వేధింపులకు గురైన మహిళలు ఫిర్యాదు చేయాలి ● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: మహిళలు, బాలికలకు భరోసా కేంద్రం ధైర్యంగా ఉంటుందని ఎస్పీ అఖిల్‌ మ హాజన్‌ అన్నారు. భరోసా, షీటీమ్‌ కార్యాలయాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎ స్పీ మాట్లాడుతూ, మహిళలు వేధింపులు, దాడుల కు గురైన వెంటనే డయల్‌ 100కు సమాచారం అందించాలని సూచించారు. భార్యభర్తల మధ్య గొడవలు, ఇతర సమస్యలతో సతమతమవుతున్న వారికి షీటీమ్‌, భరోసా కేంద్రాల్లో కౌన్సెలింగ్‌ ఇస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌. జీవన్‌ రెడ్డి, వన్‌టౌన్‌ సీఐ సునిల్‌ కుమార్‌, ప్రేమ్‌కుమార్‌, భరోసా సెంటర్‌ అధికారి రూపరాణి, షీటీమ్‌ సిబ్బంది వాణి, మహేష్‌ తదితరులున్నారు.

పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి

మత సామరస్యాన్ని కాపాడుతూ పండుగలను ప్రశాంతంగా జ రుపుకోవాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అ న్నారు. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌లో ఖురేషి కులస్తులు, హిందూ సంఘాలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. సరైన అనుమతి, ప త్రాలు ఉన్న పశువుల ను మాత్రమే సంహరించాలని సూచించా రు. ఆవులను ఎట్టి పరిస్థితుల్లో వధించవద్దని పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలన్నారు. సొంతగా వాహనాలు ఆపడం, తనిఖీలు నిర్వహించడం వంటివి చేయవద్దని, జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, సీఐలు సునిల్‌ కుమార్‌, నాగరాజు, ఫణిందర్‌, స్వామి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement