సాక్షి, ఆదిలాబాద్: సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. డిజిటల్ పద్ధతిలో నమోదు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఎన్నిక ల కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ‘సర్’ ప్రక్రియతో పాటు ఓటరు జాబితా సవరణ తదితర కార్యాచరణ అంతా డిజిటల్ పద్ధతిలోనే జరుపుతున్న నేపథ్యంలో పార్టీ ఇలా నిర్ణయించింది. నియోజకవర్గాల్లోని మండలాలు, మున్సిపాలిటీల్లో అన్నిచోట్ల స మన్వయ కమిటీల నియామకానికి నేతలు కసరత్తు చేస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జిగా రావుల శ్రావణ్‌కుమార్‌రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ప్రాదేశిక ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ అన్నిచోట్ల క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కా ర్యాచరణ సిద్ధం చేస్తోంది. సభ్యత్వాల నమోదుకు ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఇద్దరు కార్యకర్తలను ఎంపిక చేసి వారికి జిల్లా కేంద్రాల్లో సాంకేతిక నిపుణులతో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. మండలా లు, బల్దియాల్లో ఐదుగురు నేతలతో సమన్వయ క మిటీలను నియమించే దిశగా చర్యలు చేపట్టారు.
సంస్థాగత నిర్మాణంపై దృష్టి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ నుంచి చాలామంది ముఖ్య నేతలు పార్టీని వీడారు. దీంతో పలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు చేపట్టడంలో కొంత వెనుకబడింది. ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగత నిర్మాణం చేసి పటిష్టపర్చాలని అ ధినేత కేసీఆర్ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టా రు. జిల్లాలోని బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఇదివరకు జిల్లా అ ధ్యక్షుడిగా వ్యవహరించిన మాజీ మంత్రి జోగు రా మన్న పర్యవేక్షిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో పా ర్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతీ పోలింగ్ బూత్‌కు ఇద్దరు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి వారిని సభ్యత్వ నమోదులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది.


