జైనథ్: రైతులు పండించిన పంట కొనుగోలు విషయంలో రాజకీయం చేయొద్దని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మండల కేంద్రంలో ని మార్కెట్ కార్యాలయంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ సహకారంతో ఏర్పాటు చేసి న జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని ఆదివా రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అధి కారులు జొన్న పంట కొనుగోలు చేపడుతున్న విషయం తెలుసుకొని బీఆర్‌ఎస్ నాయకులు ధర్నాకు దిగడం సరికాదన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్‌రెడ్డి, పీఏసీఎస్ సీఈవో గంగన్న, ఉపసర్పంచ్ సుభాష్, వివిధ పార్టీల నా యకులు లింగారెడ్డి, జగదీశ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, గణేశ్‌యాదవ్, రుకేష్‌రెడ్డి, రాందాస్ పాల్గొన్నారు.


