మహాశక్తి దేవతగా బగళాముఖి అమ్మవారు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం మహాశక్తి అలంకరణలో పూజలు అందుకున్నారు. అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేశారు. పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది.
అమరావతి: మండల పరిధిలోని అత్తలూరు గ్రామంలో అత్యంత పురాతనమైన పునీత తోమాసవారి ఉత్సవాలను ఆదివారం ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే ప్రార్థన కార్యక్రమాలలో భాగంగా గుంటూరు మేత్రాసన విశ్రాంత బిషప్ రెవరెండ్ గాలిబాలి, జిల్లా వ్యాప్తంగా పలు చర్చిల నుంచి వచ్చిన 40 మంది విచారణ గురువులతో దివ్య పూజాబలి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అత్తలూరు తోమాస చర్చి ఫాదర్ చాట్ల కస్పార్ మాట్లాడుతూ అందరూ దైవం పట్ల విశ్వాసంతో, తోటి మానవుల పట్ల కరుణతో జీవించాలన్నారు. ఏసుప్రభువు మానవులకు చేసిన అనేక మంచి కార్యాలకు కృతజ్ఞతగా ఈ పండుగను నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించిన కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఐదు గంటలకు కొవ్వొత్తులతో వీధులలో ప్రదర్శన నిర్వహించారు. రాత్రికి ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో, పూలతో అలంకరించిన తేరుపై ఏసుప్రభువు విగ్రహాన్ని ఉంచి పురవీధులలో తేరు ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో విచారణ గురువులు, మఠ కన్యలతోపాటు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
3.3 సెంటీమీటర్ల
అతి సూక్ష్మ వరల్డ్ కప్ నమూనా తయారీ
చీరాల: అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో చరిత్ర సృష్టించిన భారత్ జట్టుకు బాపట్ల జిల్లా చీరాలకు చెందిన స్వర్ణకారుడు నక్కా వెంకటేష్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో 3.3 సెంటీమీటర్ల అతి సూక్ష్మమైన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ నమూనా తయారు చేశారు. క్రికెట్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్ యువ క్రికెటర్లకు దీనిని అంకితం చేశారు. ఈ కప్పును 0.500 మిల్లీగ్రాముల బంగారాన్ని, 2.900 మిల్లీగ్రాముల వెండిని ఉపయోగించి రెండు రోజులు పాటు శ్రమించి తయారు చేసినట్లు తెలిపారు.
నకరికల్లు: సీనియర్ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ మండలంలోని అడ్డరోడ్డులో గల అభయాంజనేయ స్వామిని ఆదివారం దర్శించుకున్నారు. కొండవీడు ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయన మార్గమధ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకుడు విను కొండ కొండామాచార్యులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. రాజేంద్ర ప్రసాద్‌ను కలిసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు.
మహాశక్తి దేవతగా బగళాముఖి అమ్మవారు
మహాశక్తి దేవతగా బగళాముఖి అమ్మవారు
మహాశక్తి దేవతగా బగళాముఖి అమ్మవారు
మహాశక్తి దేవతగా బగళాముఖి అమ్మవారు


