కలెక్టరేట్‌లో నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
బాపట్ల: స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతోపాటు కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పీజీఆర్‌ఎస్ రద్దు చేసినట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో పీజీఆర్‌ఎస్ కొనసాగుతుందని తెలిపారు.


