స్టేషన్‌లో ప్రత్యక్షమైన బాలికలు
వేటపాలెం: నెల్లూరు హోం నుంచి పారిపోయి వచ్చిన ముగ్గురు బాలికలు వేటపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లు ఎస్సై పి.జనార్దన్ శుక్రవారం తెలిపారు. ముగ్గురు బాలికలు మధ్యాహ్నం వేటపాలెం బైపాస్ రోడ్డులో తిరుగుతుండగా పోలీసులు కంట పడ్డారని తెలిపారు. బాలికలను విచారించగా కట్ట జ్యోతి (కావలి), గందల చందన (నెల్లూరు), గురుశి మిఽథున్ (నెల్లూరు)గా చెప్పినట్లు ఎస్సై తెలిపారు. వీరు ముగ్గురు నెల్లూరు హోం నుంచి పారిపోయి ఇక్కడకి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం వేటపాలెం పోలీస్ వారి సంరక్షణలో ఉన్నట్లు వివరించారు. వివరాలకు 9121102141, 912102143 నంబర్లను సంప్రదించాలని తెలియజేశారు.


