వెంకటసుబ్రహ్మణ్యానికి జీవన సాఫల్య పురస్కారం | - | Sakshi
Sakshi News home page

వెంకటసుబ్రహ్మణ్యానికి జీవన సాఫల్య పురస్కారం

Feb 7 2026 10:02 AM | Updated on Feb 7 2026 10:02 AM

వెంకటసుబ్రహ్మణ్యానికి జీవన సాఫల్య పురస్కారం

వెంకటసుబ్రహ్మణ్యానికి జీవన సాఫల్య పురస్కారం

వెంకటసుబ్రహ్మణ్యానికి జీవన సాఫల్య పురస్కారం

పెదకాకాని: గుంటూరు విశ్వనాథ సాహిత్య అకాడమీ దశమ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ కూచిపూడి నాట్య గురువు, సాయి మంజీర కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కాజ వెంకట సుబ్రహ్మణ్యంకు విశ్వనాథ సాహిత్య అకాడమీ జీవన సాఫల్య పురస్కారం అందించారు. వీవీఐటీయూ చాన్సలర్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ చేతుల మీదుగా ప్రదానం చేశారు. మండల పరిధిలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. చాన్సలర్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌, అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ మద్దినేని సింహకౌటిల్య చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుబ్రహ్మణ్యం దంపతులను చాన్సలర్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ సత్కరించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ వేదాంతం రామలింగ శాస్త్రి బృందం ప్రదర్శించిన కూడిపూడి నృత్యనాటకం భక్తప్రహ్లాద ప్రేక్షకులను అలరించింది. అకాడమీ కార్యదర్శి మోదుగుల రవికృష్ణ. సభ్యులు పి.సత్యనారాయణరాజు, భూసురుపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement