సందడిగా విజ్ఞాన్‌ మహోత్సవ్‌ | - | Sakshi
Sakshi News home page

సందడిగా విజ్ఞాన్‌ మహోత్సవ్‌

Feb 7 2026 10:02 AM | Updated on Feb 7 2026 10:02 AM

సందడిగా విజ్ఞాన్‌ మహోత్సవ్‌

సందడిగా విజ్ఞాన్‌ మహోత్సవ్‌

సందడిగా విజ్ఞాన్‌ మహోత్సవ్‌ ● ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎప్పుడూ నేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. పాజిటివ్‌గా ఆలోచిస్తూ, ఎప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలన్నారు. నిరంతర అభ్యాసం, పట్టుదలతో ముందుకు సాగినప్పుడే విజయాలు సొంతమవుతాయన్నారు. ఆటలోని ప్రతి అనుభవాన్ని పాఠంగా తీసుకొని ముందుకు సాగితేనే నిజమైన క్రీడాకారుడిగా ఎదగవచ్చునన్నారు. శనివారం జరిగే విజ్ఞాన్‌ మహోత్సవ్‌ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2025 ఏషియన్‌ చాంపియన్‌షిప్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌, భారత హెప్టాథ్లెట్‌ నందిని అగసారా విచ్చేస్తున్నారని తెలిపారు. ● అథ్లెటిక్స్‌లో భాగంగా 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందేలు నిర్వహించారు. వీటితో పాటు వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఖోఖో, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, చెస్‌ పోటీలను నిర్వహించారు. పోటీలన్నీ సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి శనివారం ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ● తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగిన కళలు, సృజనాత్మక నైపుణ్యాలకు పదును పెడుతూ మూడు రోజుల పాటు జరగనున్న పోటీల్లో రెండో రోజు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు సోలో సాంగ్స్‌, లఘు నాటికలు, రెట్రో డాన్స్‌ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. విద్యా సంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య, సీఈఓ డాక్టర్‌ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్‌ పీఎంవీ రావు పాల్గొన్నారు.

విద్యార్థులకు భాషపై పట్టు, నైపుణ్యం అవసరం ఇండియన్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ అద్వైతం నిరంతర అభ్యాసం, పట్టుదలతోనే విజయాలు సొంతం ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌

చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి 19వ ఎడిషన్‌ విజ్ఞాన్‌ మహోత్సవ్‌ కార్యక్రమం రెండో రోజు శుక్రవారం సందడి సందడిగా సాగింది. విజ్ఞాన మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న పోటీల్లో విద్యార్థులు నువ్వా–నేనా అన్న రీతిలో పోటీ పడ్డారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియన్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ అద్వైతం (చాంపియన్‌ మూవీ) మాట్లాడుతూ నటుడిగా ఎదగాలంటే భాషపై పట్టు అవసరమని, మంచి నటుడిగా మారాలంటే భాషలో నైపుణ్యం పెంపొందించుకోవాలని విద్యార్థు లకు సూచించారు. మంచి విమర్శలను అంగీకరించడం ద్వారా మాత్రమే వ్యక్తి ఎదుగుదల సాధ్యమని వివరించారు. జీవితాన్ని, పుస్తకాలను, సినిమాలను గమనిస్తే అనేక మంచి ఆలోచనలు వస్తాయన్నారు. భవిష్యత్తులో ఇంట్లో కూర్చొని కూడా ‘అవతార్‌’ తరహా సినిమాలను రూపొందించే స్థాయికి సాంకేతికత ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement