పచ్చ నేతల పైసా వసూల్!
న్యూస్‌రీల్
నన్ను కలిశారు.. అనుమతి లేదని చెప్పా
అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టరుకు రూ.500 నజరానా
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
చీరాల అర్బన్: పైసా వసూల్ పరమావధిగా పచ్చ నేతలు ముందుకు సాగుతున్నారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ అక్రమ వ్యాపారాలకు కొమ్ముకాస్తున్న కీలక నేత, యువనేతలు తాజాగా రామాపురంలో డబ్బుతో పేకాట ఆడేందుకు ఓ సొసైటీ నిర్వహకులతో మిలాఖత్ అయినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అందుకు కోర్టు అనుమతి ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం చేయాలని వారికి ఉచిత సలహా ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అందుకు ప్రతిగా నెలకు రూ.75లక్షలు తమకు గిఫ్ట్‌గా ఇవ్వాలని సూచించినట్లు చర్చించుకుంటున్నారు. అందుకు ప్రతిగా ఐజీతో మాట్లాడి పోలీస్ అనుమతి ఇప్పిస్తామని సొసైటీ నిర్వహకులకు యువనేత భరోసా ఇచ్చినట్లు రాజకీయ వర్గాలతో పాటు, విషయం తెలిసిన వారందరిలోను చర్చ నడుస్తోంది. అంతిమంగా నెలకు రూ.2కోట్లు అక్రమార్జనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
రేషన్ మాఫియాతో మిలాఖత్.. నెలకు రూ.25 లక్షలు అక్రమార్జన
ఒంగోలుకు చెందిన మాల్యాద్రి అనే వ్యక్తికి చీరాల నియోజకవర్గం నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేందుకు సహకరిస్తున్నారు. అందుకు మొదట నెలకు రూ.25లక్షలు కప్పం చెల్లించగా, తాజాగా తమకు నష్టాలు వచ్చాయని రూ.5 లక్షలు తగ్గించి రూ.20లక్షలు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తొలిసారి.. పందెం బరి!
నియోజకవర్గంలో తొలిసారిగా బరులు పెట్టి కోడి పందేలు జరిపించారు. ఇది సరికొత్త జూదానికి తెరతీసినట్లయ్యింది. ఇక పందిళ్లపల్లి ఓ తోటలో కొంత కాలం కోత ముక్క ఆటకు అండగా నిలిచారు. అందుకు రోజుకు రూ.2.50 లక్షలు నజరానాగా పొందినట్లు ప్రచారం జరిగింది.
బిట్టు బిట్టుకూ పర్సంటేజీ
జిల్లాలో అత్యధిక అనధికారిక లేఅవుట్లు ఉన్న ప్రాంతాలలో చీరాల నియోజకవర్గం ఒకటి. ఈ క్రమంలో అనధికారిక లేఅవుట్లు వేసిన వారు ముందస్తుగా ఒక మొత్తం, తరువాత క్రయ,విక్రయాలకు సంబంధించి కీలక నేత, యువనేతలకు పర్సంటేజీలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించి పెద్ద మొత్తాలు జమవుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించటం అందుకు నిదర్శనమంటున్నారు.
ఐజీ గారికి చెప్తాం.. అధైర్యపడొద్దు!
తాజాగా రామాపురంలో ఓ సొసైటీ నిర్వహకులు డబ్బు పెట్టి పేకాట అడించేందుకు తమకు కోర్టు అనుమతి ఉందని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. అందుకు సంబంధించి పోలీస్ అనుమతి కోసం డీఎస్పీని కలసినట్లు తెలిసింది. అయితే ఆయన వారికి ఎలాంటి అనుమతి ఇవ్వబోమని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యువనేత సదరు సొసైటీ నిర్వహకులకు అధైర్య పడకండి, ఐజీ గారికి చెప్తాం. మీ పనులు మీరు చేసుకోండని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
రామాపురంలో ఓ సొసైటీ నిర్వాహకులు తమ కార్యకలాపాలకు సిద్ధం చేసుకుంటున్న నిర్మాణం
ఓ సొసైటీ నిర్వహకులు రామాపురంలో డబ్బుతో పేకాట ఆడేందుకు అనుమతి ఇవ్వమని నన్ను కలిశారు. అనుమతి ఇవ్వబోమని చెప్పాం. ఇది మంచి సంస్కృతి కాదని చెప్పాను. వారు మాట్లాడే తీరుకు కొట్టినంత పనిచేశాం. వెళ్లిపోయారు. మాకు కోర్టు నుంచి ఎలాంటి డైరెక్షన్ అందలేదు. ఏదిఏమైనా జూద క్రీడలను ప్రోత్సహించేది లేదు. అలానే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే చర్యలను ఉపేక్షించం.
– ఎండీ మొయిన్,
డీఎస్పీ, చీరాల
అక్రమ ఇసుక దందా చేసేవారికి కొమ్ముకాసేందుకు ఒక్కో ట్రాక్టరుకు(ట్రిప్పుకు) రూ.500 వసూలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కొండలు మాదిరిగా ఉన్న ఇసుక తిన్నెలు కరిగిపోతుండటం అందుకు నిదర్శనం. చీరాల నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలు, రవాణాకు అనుమతులు లేకున్నా రోజుకు సుమారు 400 ట్రిప్పుల ఇసుక అక్రమంగా తరలుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రాత్రిళ్లు మాత్రమే అక్రమ త్వకాలు, రవాణా జరుగుతోంది. అందుకు రమారమి రోజుకు రూ.2లక్షలు చొప్పున, నెలకు రూ.60లక్షలు నేతల ఖజానాకు జమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంబంధిత అధికారుల తనిఖీలు మొక్కుబడిగా ఉంటున్నాయనేది జనవాణి. అందుకు తిలాపాపం తలా పడికెడు అన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
పేకాట ఆడించండి ..
ఐజీ గారికి చెబుతామని ఓ సొసైటీ నిర్వాహకులకు టీడీపీ నేతల ఎర
పోలీస్ అనుమతి ఇప్పించినందుకు
నెలకు రూ.75 లక్షలు
ఇవ్వాలని ఒప్పందం
ముందు డెన్ తెరవండి.. డబ్బు
నిదానంగా ఇవ్వచ్చులే అంటూ
సన్నాయి నొక్కులు
కోర్టు ఆర్డర్ ఉందనే ప్రచారం
విస్తృతంగా చేయాలని ఉచిత సలహా
రామాపురంలో ఓ సొసైటీ
నిర్వాహకులు, కీలక నేత, యువనేత
మధ్య పంచాయితీ
అక్రమ ఆదాయం నెలకు
రూ.2 కోట్లు రాబట్టే దిశగా పావులు
పచ్చ నేతల పైసా వసూల్!


