కేశవా..కనికరం లేదా! | - | Sakshi
Sakshi News home page

కేశవా..కనికరం లేదా!

Feb 15 2026 7:25 AM | Updated on Feb 15 2026 7:25 AM

కేశవా

కేశవా..కనికరం లేదా!

కేశవా..కనికరం లేదా! బడ్జెట్‌లో బాపట్ల జిల్లాకు మొండిచెయ్యి ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 ఆరవపల్లిలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభం రేపల్లె: మహాశివరాత్రిని పురస్కరించుకొని మండలంలోని ఆరవపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న బాల కోటేశ్వరస్వామి ఆలయంలో తిరునాళ్లు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ తిరునాళ్లలో భాగంగా తొలిరోజు వేకువజామునే స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశుసంపద అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ పశు యజమానులు తమ పశువులను ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. మల్లేశ్వర స్వామికి చేనేత పట్టు వస్త్రాలు పొగడ వృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు నిత్యాన్నదానానికి విరాళాలు సాక్షి ప్రతినిది, బాపట్ల: అధికారం యావతో అలవికాని హామీలు ఇచ్చి జనాన్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు నిధులు కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ప్రధాన సాగునీటి వనరు కొమ్మమూరు కాలువ ఆధునికీకరణకు మొక్కుబడిగా నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంది. కొమ్మమూరుతోపాటు దాని అనుబంధ సాగునీటి కాలువలు ఇప్పటికే గట్లు తెగి, పూడికతో దెబ్బతిన్నాయి. 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు సజావుగా అందే పరిస్థితి లేకుండా పోయింది. కాలువ ఆధునికీకరణకు సుమారు రూ.150 కోట్ల నిధులు కావాలని అధికారులు ప్రతిపాదించగా ప్రభుత్వం కేవలం రూ.120 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. వేమూరు, రేపల్లె పరిధిలోని రేపల్లె బ్యాంక్‌ కెనాల్స్‌ సైతం దెబ్బతిన్నాయి. కృష్ణా కరకట్ట 50 చోట్ల తెగిపోయే దశలో వుందని, ఆధునికీకరణకు దాదాపు రూ.800 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించగా ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించలేదు. బాపట్ల జిల్లాలకు కేవలం కృషివిజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని ప్రభుత్వం ప్రకటించి చేతులు దులుపుకుంది. జిల్లాలోని 74 కిలోమీటర్ల మేర ఉన్న తీరప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పదేపదే చెబుతున్న ప్రభుత్వం అంతే స్థాయిలో నిధులు మాత్రం కేటాయించలేదు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మాణం మొదలు పెట్టిన బాపట్ల మెడికల్‌ కళాశాలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. గత ప్రభుత్వం నిజాంపట్నం హార్బర్‌కు రూ.451 కోట్లు కేటాయించి 80 శాతం పనులు పూర్తిచేయగా మిగిలిన 20 శాతం పనులను కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజా బడ్జెట్‌లో నామమాత్రపు నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. నిజాంపట్నం ఆక్వా పార్కు పనులు నిధులు లేక నత్తనడకన సాగుతున్నాయి. ఆక్వా సాగుకు సంబంధించి విద్యుత్‌ సబ్సిడీకి బడ్జెట్‌లో మొక్కుబడి నిధులు కేటాయించారు. జిల్లాలో ఎంతమంది రైతులకు విద్యుత్‌ సబ్సిడీ లభిస్తుందో తెలియని పరిస్థితి. ఇక సంక్షేమ పథకాలకు ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో ఆ పథకాలు అమలుకు నోచుకునే పరిస్థితి కానరావడంలేదు. చీరాలలో చేనేత క్లస్టర్‌కు, నిజాంపట్నంలో వాన్‌పిక్‌ సిటీ, చీరాలలో ఐటీ హబ్‌లకు నిధులు కేటాయించిన పాపాన పోలేదు. మత్స్యకారుల ఎగుమతులకు, చీరాలలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు రహదారుల అభివృద్ధికి బాపట్ల, చీరాల, మార్టూరు ప్రాంతాల్లో చివరి ఆయకట్టుకు సాగునీటి తరలింపు, లిప్ట్‌ స్కీములకు సైతం కేటాయింపులు లేవు.

న్యూస్‌రీల్‌

ఇది తిరోగమన బడ్జెట్‌

ఇది తిరోగమన బడ్జెట్‌. కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ఎటువంటి నిధులు కేటాయించలేదు. నల్లమడ డ్రెయిన్‌, కొమ్మమూరు కాలువ అభివృద్ధి, గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించడానికి, నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ను పూర్తి చేయడానికి, జిల్లా పరిపాలన కార్యాలయాల ఏర్పాటుకు సైతం నిధుల కేటాయింపులు లేకపోవడం దారుణం.

వైద్యరంగాన్ని విస్మరించారు

ఈ ప్రభుత్వం వైద్యరంగం అభివృద్ధికి బడ్జెట్‌లో తగినంతగా నిధులు కేటాయించలేదు. గత ప్రభుత్వం మంజూరుచేసి పనులు మొదలు పెట్టిన బాపట్ల వైద్య కళాశాలను పట్టించుకోలేదు. ప్రజలు చనిపోయినా ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి నిరుపేదలు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.

నిరుద్యోగ భృతి లేనట్లే..

సూపర్‌ సిక్స్‌లో చెప్పిన మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతిని బడ్జెట్‌లో పట్టించుకోలేదు. పంటల బీమాను రైతులకు ఉపయోగకరంగా తీర్చిదిద్దే ఆలోచన కూడా లేదు. కౌలు రైతులను పట్టించుకోలేదు. ఫీజు రీయింబర్స్‌ బకాయిల గురించి పట్టించుకోలేదు.

మినీ హార్బర్‌ ఏర్పాటు చేస్తాం

బడ్జెట్‌లో బాపట్ల జిల్లాకు మొండిచెయ్యి
హార్బర్‌ ఆశలు.. ఆవిరి!

కొమ్మమూరు కాలువ

ఆధునికీకరణ గాలికి

కృష్ణా కరకట్టలను పట్టించుకోని వైనం

మెడికల్‌ కళాశాల, నిజాంపట్నం

హార్బర్‌లపై సవతి ప్రేమ

సంక్షేమ పథకాలకు నిధుల

కేటాయింపులు లేవు

సాగర్‌మాల తొలి దశలో

చీరాల ప్రాజెక్టుకు ప్రతిపాదన

రూ.409 కోట్లతో నిర్మాణానికి

మార్గం సుగమం

ఫిషింగ్‌ హార్బర్‌కు అప్పటి

సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన

తరువాత పట్టించుకోని

చంద్రబాబు సర్కార్‌

ప్రత్యక్షంగా, పరోక్షంగా

10 వేల మంది ఉపాధికి గండి

నిజాంపట్నం ఫిషింగ్‌

హార్బర్‌ పనుల పూర్తిపైనా నిర్లక్ష్యం

మంగళగిరి టౌన్‌: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న గంగ, పార్వతి (దుర్గా) సమేత మల్లేశ్వర స్వామి వారికి మంగళగిరికి చెందిన బహుత్తమ పద్మశాలీ సేవా సంఘం ప్రతినిధులు శనివారం చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. ఏటా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. పట్టు వస్త్రాలను సమర్పించేందుకు విచ్చేసిన సేవా సంఘం సభ్యులకు ఆలయ ఈఓ శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలి కారు. సేవా సంఘం సభ్యులు తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం స్వామికి పట్టువస్త్రాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. పట్టువస్త్రాలు సమర్పించిన వారిలో చిల్లపల్లి మోహన్‌రావు, అందే నాగవరప్రసాద్‌, చిల్లపల్లి శ్రీనివాస్‌, తమ్మిశెట్టి జానకీదేవి, గంజి చిరంజీవి, గుత్తికొండ ధనుంజయరావు, దామర్ల నాగమణి, రామనాధం శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

మంగళగిరి టౌన్‌: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో 8వ రోజుకు చేరుకున్నాయి. స్వామి వారు పొగడ వృక్ష వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పురవీధుల్లో నిర్వహించిన ఊరేగింపులో భక్తులు ఆయా కూడళ్లలో స్వామివారిని దర్శించుకుని టెంకాయలు, హారతులు సమర్పించారు. మంగళగిరి పట్టణానికి చెందిన జంజనం ప్రసన్న కోటేశ్వరరావు, అనిత దంపతులు, వంగర కవిత, దుర్గా వెంకట మహేష్‌ దంపతులు, కుటుంబ సభ్యులు ఉత్సవ కై ంకర్య పరులుగా వ్యవహరించారు. దేవస్ధాన ఈ.వో. గోపీ ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. గుంటూరు బ్రాడీపేటకు చెందిన పి.కామేశ్వరరావు కుటుంబం ఈఓ శీనానాయక్‌ను కలిసి రూ.1,01,116 విరాళం అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

పర్యాటక రంగానికి నామమాత్రమే..

మెడికల్‌ కళాశాల ఊసే లేదు

మొక్కుబడిగా విద్యుత్‌ సబ్సిడీ

చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌లో బాపట్ల జిల్లా మొండిచెయ్యి చూపింది. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ప్రధాన సాగునీటి వనరు కొమ్మమూరు కాలువ ఆధునికీకరణకు మొక్కుబడిగా నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంది. చీరాలలో చేనేత క్లస్టర్‌, నిజాంపట్నంలో వాన్‌పిక్‌ సిటీ, చీరాలలో ఐటీ హబ్‌లకు నిధులు కేటాయించిన పాపాన పోలేదు. బడ్జెట్‌పై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు.

– సీహెచ్‌.గంగయ్య,

సీపీఎం జిల్లా కార్యదర్శి

–తన్నీరు సింగరకొండ,

సీపీఐ జిల్లా కార్యదర్శి

– మజుందార్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి

ఇక్కడ మినీ ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఈపురుపాలెం స్ట్రయిట్‌ కట్‌ అడవి పంచాయతీ పరిధిలో జెట్టీ ఏర్పాటుకు కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి. అన్ని అనుకూలించాక పనులు చేపట్టే అవకాశం ఉంటుంది.

– శ్రీనివాస్‌ నాయక్‌,

జేడీ, మత్స్యశాఖ, బాపట్ల

చీరాలఅర్బన్‌: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్పటి చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్సార్‌ సీపీ నియోజవకర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వాడరేపు ఫిషింగ్‌ హార్బర్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ ఊసే లేకుండా పోయింది. స్థానిక ప్రజా ప్రతినిధులకు కూడా చిత్తశుద్ధి లేకపోవటమే దీనికి కారణమని ప్రజలు మండిపడుతున్నారు. మినీ హార్బర్‌ పేరుతో అంచనా వ్యయం తగ్గించి డీపీఆర్‌ తయారు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

సాగర్‌మాల తొలిదశలో..

కేంద్ర ప్రభుత్వం సాగర్‌మాల తొలి దశలో భాగంగా ప్రతిపాదించిన వాటిలో చీరాల మండలం వాడరేవు ఫిషింగ్‌ హార్బర్‌ ఒకటి. పీఎంఎస్‌వై (ప్రధాన మంత్రి మత్స్యసంపద సమృద్ధి యోజన)కింద రూ.409 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో కేంద్రం వాటా 60 శాతం. మిగతాది రాష్ట్రం ఇవ్వాలి. అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చిత్తశుద్ధితో నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ దాదాపు 80 శాతం నిర్మాణం పూర్తయింది. దీనిని ఆయన ప్రారంభించిన రోజే వర్చువల్‌ విధానంలో వాడరేవు ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

చంద్రబాబు సర్కార్‌ వచ్చాక దీనిని గాలికి వదిలేసింది. స్థానిక ఎమ్మెల్యే కొండయ్య దృష్టి పెట్టలేదు. ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటైతే సుమారు 10వేల మందికి ఉపాధి లభించేదని స్థానికులు తెలిపారు. చంద్రబాబు సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు ఆర్థికంగా లబ్ధి పొందేవారు. వారి వారసులకు మంచి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తక్కువ ఖర్చుతో మినీ హార్బర్‌ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగా బెంగళూరుకు చెందిన సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కోస్టల్‌ ఫిషరీస్‌ ప్రాజెక్ట్స్‌ అనే సంస్థ సదరు మినీ హార్బర్‌కు సంబంధించిన డీపీఆర్‌ తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పనులు ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పుడు పూర్తి చేస్తారో ఇప్పటికీ తెలియదు.

జెట్టీ ఏర్పాటుకు ఆటంకాలు?

ఒక దశలో ఫిషింగ్‌ హార్బర్‌కు ప్రత్యామ్నాయంగా వాడరేవు సమీపంలోని ఈపురుపాలెం స్ట్రయిట్‌కట్‌ వద్ద మత్స్యకారులు పడవలు నిలుపుకొనేందుకు జెట్టీ (ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్‌)ఏర్పాటు చేయనున్నట్లు పాలకులు సెలవిచ్చారు. సుమారు రూ.1.50 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు.

ఈ నేపథ్యంలో స్ట్రయిట్‌ కట్‌లో బోట్లు ఉంటే డీజిల్‌ తదితరాలు నీటిని కలుషితం చేసి పంటలకు నష్టం వాటిల్లుతుందని కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. అక్కడ జెట్టీ ఏర్పాటుకు కూడా ఆటంకం ఏర్పడిందని అధికారులు, మత్స్యకారులు తెలిపారు.

కేశవా..కనికరం లేదా! 1
1/7

కేశవా..కనికరం లేదా!

కేశవా..కనికరం లేదా! 2
2/7

కేశవా..కనికరం లేదా!

కేశవా..కనికరం లేదా! 3
3/7

కేశవా..కనికరం లేదా!

కేశవా..కనికరం లేదా! 4
4/7

కేశవా..కనికరం లేదా!

కేశవా..కనికరం లేదా! 5
5/7

కేశవా..కనికరం లేదా!

కేశవా..కనికరం లేదా! 6
6/7

కేశవా..కనికరం లేదా!

కేశవా..కనికరం లేదా! 7
7/7

కేశవా..కనికరం లేదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement