క్రీడాకారులకు గెలుపు, ఓటములు సహజం
●ఇండియన్ వాలీబాల్ కోచ్ ఆరికపూడి
●భట్టిప్రోలులో అట్టహాసంగా రాష్ట్ర స్థ్ధాయి వాలీబాల్ పోటీలు
భట్టిప్రోలు: క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని జాతీయ అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ఇండియన్ వాలీబాల్ కోచ్ ఆరికపూడి రమణరావు అన్నారు. భట్టిప్రోలు టీఎం రావు హైస్కూల్‌లో పులికొండ రాధాకృష్ణ గుప్తా, కొసన సుబ్బారావు(ఎన్‌డీఎస్) మెమోరియల్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఇన్‌విటేషన్ టోర్నమెంట్‌ను ఎం.రవీంద్రనాథ్ ఠాగూర్‌తో కలసి శనివారం ప్రారంభించారు. రమణారావు మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని అతిథులు ప్రేరణనిస్తారని అన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు, బాపట్ల, నెల్లూరు, ఎన్‌టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి 15 టీమ్‌లు హాజరవుతున్నట్లు నిర్వాహక కమిటీ అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు పి. మల్లికార్జునరావు, అల్లాభక్షు, కరింశెట్టి సుబ్బారావు(కన్వీనర్), వి.శేషగిరిరావు(సెక్రటరీ) తెలిపారు. పోటీలను షేక్ కరిముల్లా, గార్యాల వెంకటేశ్వరరావు, జీవీఎస్ నాగేశ్వరరావు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు కిరణ్, ప్రసాద్, పీఈటీ చేబ్రోలు శ్రీనివాసరావు, పాల్గొన్నారు.
క్రీడాకారులకు గెలుపు, ఓటములు సహజం


