మెడికల్‌–ఫార్మా మాఫియాపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌–ఫార్మా మాఫియాపై ఆందోళన

Feb 15 2026 7:25 AM | Updated on Feb 15 2026 7:25 AM

మెడికల్‌–ఫార్మా మాఫియాపై ఆందోళన

మెడికల్‌–ఫార్మా మాఫియాపై ఆందోళన

మెడికల్‌–ఫార్మా మాఫియాపై ఆందోళన

లక్ష్మీపురం: మెడికల్‌, ఫార్మా రంగాల్లో పెరుగుతున్న అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా రాష్ట్ర సమితి పిలుపుతో గుంటూరు జిల్లా సీపీఐ సమితి ఆధ్వర్యంలో శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత, రాజ్యాంగ హక్కు అని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. నాణ్యమైన ఆరోగ్యసేవలు అందించకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ, ప్రైవేట్‌ కళాశాలల్లో స్టైఫండ్‌ ఎగవేతపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి అధ్యక్షత వహించారు. కార్యదర్శి ఆకిటి అరుణ్‌ కుమార్‌, జిల్లా సహాయ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, మేడా హనుమంతరావులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement