పోలు రాధా ఎడ్ల పందేలలో బాపట్ల జిల్లా హవా | - | Sakshi
Sakshi News home page

పోలు రాధా ఎడ్ల పందేలలో బాపట్ల జిల్లా హవా

Feb 15 2026 7:25 AM | Updated on Feb 15 2026 7:25 AM

పోలు

పోలు రాధా ఎడ్ల పందేలలో బాపట్ల జిల్లా హవా

పోలు రాధా ఎడ్ల పందేలలో బాపట్ల జిల్లా హవా

చినగంజాం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని సోపిరాల శ్రీ లలితా రామకోటేశ్వరాలయంలో నిర్వహించిన రెండు తెలుగు రాష్ట్రాల రాష్ట్ర స్థాయి సీనియర్‌ విభాగం నాటుబండి పోలు రాధా ఎడ్ల పందేలు శనివారం వేకువజాముతో ముగిశాయి. చినగంజాం, సోపిరాల టైరుబండ్ల యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో మొత్తం 12 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ టీఎస్సార్‌ ఆంజనేయులు చేతుల మీదుగా విజేతలైన కోడెల యజమానులకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతిని బాపట్ల జిల్లా అమృతలూరు మండలం పెదపూడికి చెందిన ఆళ్ల హరికృష్ణ యాదవ్‌ ఎడ్ల జత సాధించగా రూ.30 వేల నగదు బహుమతిని ఆలయ కమిటీ చైర్మన్‌ టీఎస్సార్‌ ఆంజనేయులు అందజేశారు.

ద్వితీయ బహమతిని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పగడాలవారిపాలెం శ్రీలతారెడ్డి, ప్రణీత్‌రెడ్డి ఎడ్ల జత సాధించగా రూ.25 వేలు నగదు బహుమతిని ఆమంచి రత్తయ్య జ్ఞాపకార్థం కుమారులు వెంకటేశ్వరరావు, బ్రహ్మయ్య అందజేశారు.

మూడో బహుమతి చినగంజాం మండలం ఆవులదొడ్డిగొల్లపాలేనికి చెందిన గోగినేని జ్ఞానసాయి దీపక్‌చౌదరి ఎడ్ల జత సాధించగా రూ. 20 వేలు నగదు బహుమతిని పోలకం నరసింహారావు, ప్రయత్నం దినపత్రిక ఎడిటర్‌ పోలకం శ్రీనివాసరావు అందజేశారు. నాలుగో బహుమతిని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం జజ్జర యలమంద, వెంకట గోపాలకృష్ణ, జజ్జర తవిరికల ఎడ్ల జత సాధించగా రూ.15 వేల బహుమతిని వైస్‌ ఎంపీపీ తుమ్మలపెంట ప్రసన్నలక్ష్మి, శ్రీనివాసరావు అందజేశారు. ఐదో బహుమతిని ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన బొడ్డు బాలకృష్ణ ఎడ్ల జత సాధించగా రూ.11 వేలు నగదు బహుమతిని ఉలిచి వెంకటరావు జ్ఞాపకార్థం అంజినాయుడు అందజేశారు. ఆరో బహుమతిని బాపట్ల జిల్లా చినగంజాం మండలం సోపిరాల గ్రామానికి చెందిన దేవరకొండ సుబ్బారావు ఎడ్ల జత సాధించగా రూ.7 వేల నగదు బహుమతిని తుమ్మలపెంట శ్రీనివాసరావు, బ్రహ్మయ్య, రాఘవయ్య అందజేశారు. అలాగే తొమ్మిది వరుస బహుమతులు అందించారు. కార్యక్రమంలో తుమ్మలపెంట జయరావు, రాఘవయ్య, ఆమంచి బ్రహ్మయ్య, ఆమంచి సుబ్బారావు, గంట సుబ్బారావు, ముంగర అప్పారావు, రాయని కృష్ణ, పుల్లయ్య, టి.చిన్న, టి. బాపయ్య, టి.వెంకటేశ్వరరావు, జి.నరసింహారావు, కుర్రి రమణారావు, వి. రామసుబ్బారావు, పోలకం శరభారావు, జి.వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.

పోలు రాధా ఎడ్ల పందేలలో బాపట్ల జిల్లా హవా 1
1/1

పోలు రాధా ఎడ్ల పందేలలో బాపట్ల జిల్లా హవా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement